PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఆర్​ఎన్​ఐ’ పత్రికల పేర్లను ఆన్​లైన్​లో నమోదు చేయాలి

1 min read

జాయింట్​ కలెక్టర్​ను కోరిన ఏపీజేఎఫ్​ జర్నలిస్టులు

పల్లెవెలుగు: జర్నలిస్టుల అక్రిడిటేషన్​ మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.38 ప్రకారం ఆర్​ఎన్​ఐ గల పత్రికల (సంస్థ) పేర్లను ఆన్​లైన్​ (వెబ్​సైట్​) లో నమోదు చేయించాలని ఏపీజేఎఫ్​ ఆధ్వర్యంలో సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా జాయింట్​ కలెక్టర్​ నారపు రెడ్డి మౌర్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జీఓనం.38 ప్రకారం ఆర్​ఎన్​ఐ ఉన్న ప్రతి పత్రికను ఆన్​లైన్​ (వెబ్​సైట్​)లో నమోదు చేయాలని, కానీ కర్నూలు సమాచార శాఖ అధికారులు  ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఐ అండ్​ పీఆర్​ అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల చిన్న పత్రికల మనుగడ కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పత్రికను ముద్రిస్తూ ఆర్థిక కారణాల వల్ల కేవలం మూడు నెలలు రెగ్యులారిటీ లేదని .. ఆన్​లైన్​ నుంచి పత్రికను తొలగించడం  ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కావున తక్షణమే అర్హులైన పత్రికలు అన్నిటిని ఆన్లైన్లో నమోదు చేయాలని లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో సమాచార శాఖ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టాల్సి వస్తుందని ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, సాయి కుమార్ నాయుడు వెల్లడించారు. ఇందుకు స్పందించిన జాయింట్​ కలెక్టర్​ నారపు రెడ్డి మౌర్య సమాచార శాఖ అధికారులను పిలిపించి.. జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు పోరం జిల్లా నాయకులు మధు, కరీం, సామెల్, శ్రీనివాసులు, శ్రీనాథ్ రెడ్డి, రంగా తదితరులు పాల్గొన్నారు.

About Author