NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాలెం పల్లె వద్ద రోడ్డు ప్రమాదం

1 min read

– కారు ను ఢీకొన్న లారీ, ఒకరి మృతి 6 మందికి గాయాలు

– వీరంతా ఓకే కుటుంబానికి చెందిన వారు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : వారంతా ఓకే కుటుంబానికి చెందినవారు వ్యక్తిగత పనుల నిమిత్తమై శనివారం నాడు గిద్దలూరు కు వెళ్లి అక్కడి నుండి మంగళవారం తెల్లవారుజామున కడప నగరం అశోక్ నగర్ కు బయలుదేరారు, మరో 10 నిమిషాలలో ఇంటికి చేరుకునే లోపు కడప బైపాస్ పాలెం పల్లె వద్ద ఉదయం 6:30 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం సంభవించింది కారులో ప్రయాణిస్తున్న ఏడు మందిలో ఒకరు మృతి చెందగా ఆరు మందికి గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, కడప నగరం అశోక్ నగర్ కు చెందిన శ్యాంసన్ తన కుటుంబంతో వ్యక్తిగత పనులపై గిద్దలూరు వెళ్లి పనులు ముగించుకుని తిరిగి మంగళవారం తెల్లవారుజామున కడపకు బయలుదేరడం జరిగింది అన్నారు, అయితే కడప బైపాస్ పాలంపల్లె వద్దకు రాగ ఉదయం 6:30 గంటలకు రాజంపేట వైపు నుండి, అలంఖాన్ పల్లె బైపాస్ మీదుగా వెళుతున్న లారీ అతివేగంగా ఢీకొనడంతో కారు నడుపుతున్న సామ్సన్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నారు, అందులో ప్రయాణిస్తున్న సాంసన్ భార్య శోభారాణి అతని ఇద్దరి కూతుర్లు, కొడుకు తోపాటు శోభారాణి ఆడబిడ్డ ఝాన్సీ ప్రసన్న కుమారి ఆమె కొడుకు, కూతురు తో సహా 6 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని 108 అంబులెన్స్ సహాయంతో చికిత్స నిమిత్తం వారిని కడప సర్వేజనా ఆసుపత్రికి( రిమ్స్) కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసులు రెడ్డి తెలిపారు .

About Author