PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు ప్రమాదం.. సినీ న‌టికి తీవ్రగాయాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కోలీవుడ్ న‌టి, బిగ్ బాస్ ఫేమ్ యాషికా ఆనంద్ కు తీవ్రగాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆమె స్నేహితురాలు ప్రాణాలు కోల్పోయారు. వీకెండ్ సంద‌ర్భంగా త‌న స్నేహితురాళ్లతో క‌లిసి యాషికా మ‌హాబ‌లిపురం లాంగ్ డ్రైవ్ వెళ్లింది. అర్ధరాత్రి ఒంటిగంట స‌మ‌యంలో వీరి కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్ ను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆమె స్నేహితురాలు భ‌వానీ మృతి చెందింది. యాషికాతో పాటు మ‌రో ఇద్దరు స్నేహితురాళ్లకు తీవ్రగాయాల‌య్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి త‌ర‌లించారు. అతి వేగ‌మే ప్రమాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు తెలిపారు.

About Author