రోడ్డు ప్రమాదాలపై..అప్రమత్తం ఉండాలి: యంవిఐ రాజేశ్వర రావు
1 min readపల్లెవెలుగు వెబ్,అన్నమయ్య జిల్లా రాయచోటి: ప్రమాదాల పై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని రాయచోటి మోటారు వాహనాల తనిఖీ అధికారి రాజేశ్వర రావు పేర్కొన్నారు.రాయచోటీ పట్టణం మున్సిపల్ కార్యాలయం నందు రోడ్లు పై జరుగుతున్న ప్రమాదాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,నివారణకు,ప్రమాదాబారిన పడి నప్పుడు పాటించవలసిన పద్ధతులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన సమావేశం నిర్వహించారు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమీషనర్.రోడ్ల పై వాహనదారులు ప్రయానించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను తప్పని సరిగా అనుసరించాలన్నారు.ప్రమాదాలు జరిగినప్పుడు వారిని వెంటనే హాస్పిటల్ కు చేర్పించి ప్రాణాలు రక్షించిన వారిని గుడ్ సమార్టిన్ గా గుర్తించి వారికి 5 వేల రూపాయల నగదును పురస్కారాన్ని అందజేయడం జరుగుతుందన్నారు.రక్షించని వారి పట్ల పోలీసులు ఎటువంటి ప్రశ్నలు కానీ ,వేధింపులకు గురి చేయరని ఈ సందర్బంగా వారు తెలియజేశారు.మోటారు వాహనాల తనిఖీ అధికారి రాజేశ్వర వవు మాట్లాడుతు రోడ్ల పై వాహనాలు నడిపే తప్పుడు రోడ్ల భద్రత నియమాలు తప్పని సరిగా పాటించాలన్నారు.వాహనానికి సంబంధించి ఆర్సీ,ఇన్సూరెన్స్,ఫిట్ నెస్ సర్టిఫికెట్ ,పొల్యూషన్ సర్టిఫికెట్ తో పాటు వాహనదారుడు లైసెన్స్ కలిగిఉండాలన్నారు.మద్యం సేవించి వాహనం నడపారదన్నారు. ఈకార్యక్రమంలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.