అరకోరగా రోడ్డు నిర్మాణ పనులు…!
1 min read
హొళగుంద న్యూస్ నేడు : సంవత్సరాలుగా నిర్మాణం చేపట్టుకొని ఆదోని, హోళగుంద ప్రధాన రహదారికి రోడ్లు నిర్మాణానికి సంబంధించి గత రెండు సంవత్సరాల క్రితం డబల్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ అభివృద్ధి సంస్థ నిధుల ద్వారా నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. రహదారి నిర్మాణానికి సంబంధించి గత సంవత్సరం అరకోరగా రోడ్డు నిర్మాణ పనులను గుత్తేదారులు ప్రారంభించారు. రహదారి నిర్మాణ పనులు చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆ రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన గుత్తేదారుడు చేసుకున్న అగ్రిమెంట్ను రద్దు చేయడంతో సంబంధిత శాఖ అధికారులు కనీసం మరమ్మత్తులు పనులు అయినా చేసి రహదారిపై ప్రయాణించే వారికి అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. గత కొన్ని రోజులుగా సంబంధిత శాఖ అధికారులను మరమత్తు పనులు చేపట్టాలని మండల వాసులు కోరుతుండడంతో డబుల్ రోడ్డుకు సంబంధించి అగ్రిమెంట్ కావడంతో మరమత్తు పనులు చేపట్టడానికి వీలుకాదని సూటిగా తెలియజేసిన అధికారులు అగ్రిమెంట్ రద్దు కావడంతో ఇప్పుడైనా మరమ్మతు పనులు చేపట్టాలని ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు. హొళగుంద నుండి ఆదోని వరకు ప్రధాన రహదారి 32 కిలోమీటర్లు రోడ్డు మొత్తం పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో ఈ. రహదారిపై ప్రయాణీకులు ప్రయాణమే మానివేసిన సంఘటనలు ఉన్నాయి.హోళగుంద మండలం జిల్లాకు సుదూర ప్రాంతం, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో జిల్లా అధికారులు, ఇటు పాలకులు రోడ్లు, మండల అభివృద్ధి పై ఎటువంటి దృష్టి సారించకపోవడంతో గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలోనేఅద్వాన్న స్థితిలో ఉన్న ఆదోని హోళగుంద ప్రధాన రహదారిఅద్వాన్న స్థితిలో ఉన్న రహదారిలో ఈ రహదారి ఒక్కటీ . హోళగుంద మండలం వెనుకబడిన ప్రాంతం, ఎటువంటి అభివృద్ధికి నోచుకోని మండలంగా మిగిలి ఉంది. ఆదోని నుండి హోళగుంద కు 32 కిలోమీటర్లు, ధనాపురం నుండి హొళగుంద వరకు 25.5 కిలోమీటర్ల రహదారి అద్వాన్న స్థితిలో ఉన్న ఈ రహదారిపై ప్రయాణించడానికి ప్రజలు పడుతున్న కష్టాలు నరకానికి దారితీస్తున్నది. రహదారి నిర్మాణ పనులకు సంబంధించి సింగల్ రోడ్డు నిర్మాణ పనులు చేపడతారని సమాచారం ఉండడంతో ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న ఈ రహదారి నిర్మాణ పనులు ఇంకెప్పుడు ప్రారంభిస్తారని ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇప్పటి కైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు దృష్టికి తీసుకెళ్లి రహదారి పనులకు సంబంధించి నూతనంగా టెండర్ ప్రక్రియ ప్రారంభించే లోపో కనీసం మరమ్మత్తు పనులు అయినా చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.