PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైస్కూల్ కు రహదారి సౌకర్యం కల్పించాలి..

1 min read

– విద్యార్థిని విద్యార్థుల గర్జన..
పల్లెవెలుగు వెబ్​ ,పాణ్యం: పాణ్యం ఏపీ మోడల్ స్కూల్ , కస్తూరిబా పాఠశాలల విద్యార్ధిని – విద్యార్ధుల కష్టాలపై విద్యార్థిని విద్యార్థులు రోడ్డు ఎక్కారు సుగాలి మెట్ట నుండి మోడల్ స్కూల్ వరకు అధికారులు ఆదేశాలు మేరకు నేషనల్ హైవే వారు సీసీ రోడ్లు నిర్మించాలని , సుగాలిమెట్ట వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేయాలని కోరుతూ రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ (ఆర్వీఎఫ్) ఆధ్వరంలో పాణ్యంలో బుధవారం నాడు విద్యార్ధులు స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి , కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఆర్వీఎఫ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు రామినేని రాజునాయుడు హాజరై మాట్లాడారు.ఈ సందర్బంగా ఆర్వీఎఫ్ జిల్లా అధ్యక్షులు బత్తిని ప్రతాప్ , ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఏ.ఐ.ఎఫ్.బి) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వనం వెంకటాద్రి , పార్టీ సీనియర్ నేత కేజే. శ్రీనివాసరావు , బీసీ-ఎస్సీ-ఎస్టీ-మైనారిటీ విద్యార్ధి , యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ యాదవ్ మాట్లాడుతూ పాణ్యం మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ , కస్తూరిబా పాఠశాలలో దాదాపు 2వేల మంది విద్యార్ధినీ , విద్యార్ధులు చదువుతున్నారనీ , వీరు ప్రతి నిత్యం సుగాలిమెట్ట నుండి మోడల్ స్కూల్ & కస్తూర్బా స్కూలు వరకు ఒక కిలోమీటరు దూరం కంకర రాళ్లలో , ముళ్ల కంపలలో నడుచుకుంటూ వెళుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ , పలుమార్లు ఈ సమష్యపై అధికారులకు విన్నవించినప్పటికీ అధికారులు స్పందించి అక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జీ నిర్మాణం , మోడల్ స్కూల్ వరకు రోడ్లు వేయాలని నేషనల్ హైవే వారిని , స్ధానిక అధికారులను ఆదేశించినప్పఇప్పటికైనా నేషనల్ హైవే వారు జిల్లా స్ధాయి అధికారుల ఆదేశాల మేరకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం , సుగాలి మెట్ట నుండి మోడల్ స్కూల్ వరకు బస్సు వెళ్లేందుకు , విద్యార్ధుల సౌకర్యార్ధం సీసీ రోడ్లు వేయాలని వారు కోరారు. లేదంటే నేషనల్ హైవేపై విద్యార్ధులతో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. అనంతరం స్ధానిక ఎంఆర్ఓ మల్లిఖార్జున రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.

About Author