PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు గుంతలు పూడ్చలేరు..మూడు రాజధానులు నిర్మిస్తారా..

1 min read

-ప్రజలను మోసం చేయడమే తప్పా అభివృద్ధి లేదు:సిపిఎం

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: రహదారుల రోడ్ల గుంతలు పూడ్చలేని జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు నిర్మిస్తానని చెప్పడం ప్రజల్ని మోసం చేయడం తప్పా మరొక్కటి కాదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.నాగేశ్వర రావు ఆరోపించారు.గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నందికొట్కూరు నుండి నంద్యాల జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని మిడుతూరు నుండి చెరుకుచెర్ల బాట వరకు మంచాలకట్ట రోడ్డు నుండి గడివేముల వరకు మరియు పై పాలెం-కడుమూరు వరకు రోడ్డు మోకాళ్ళ లోతుల గుంతలు ఉన్నాయి వాటిని సిపిఎం బృందం నాగేశ్వర రావు,కె భాస్కర్ రెడ్డి,పక్కీర్ సాహెబ్,టి గోపాలకృష్ణ తదితరులు రోడ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా నాగేశ్వర రావు మాట్లాడుతూ నంద్యాలను జిల్లా ఏర్పాటు చేయడం తప్పా నందికొట్కూరు నుండి నంద్యాల జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 70 కిలోమీటర్లు ఉందని 100 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి.రోడ్డు అధ్వాన్న మైన పరిస్థితిలో ఉన్నది వర్షాకాలంలో నీరు నిల్వ చేరి అనేక మంది కిందపడి గాయాల పాలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుంతలు పూడ్చి రోడ్డు ఏర్పాటు చేసే దిక్కులేదని అలగనూరు రిజర్వాయర్ గండి పడి మూడు సంవత్సరాలు అవుతున్నా పూడ్చే దిక్కులేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తామని ప్రజల్ని మోసం చేయడం తప్ప మరోటి కాదన్నారు వెన కటికి ఒక సామెత లాగా తినడానికి తిండి లేకపోయినా మీసాలకు సంపంగి నూనె అని జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని వారు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే రోడ్లను వేయాలని నందికొట్కూరు నుండి నంద్యాల జిల్లా కేంద్రానికి ప్రజలు,విద్యార్థులు, రైతులు వెళ్లేందుకు డబల్ రోడ్డు ఏర్పాటు చేయాలని,ఎక్స్ ప్రెస్ బస్సులు నడపాలని  డిమాండ్ చేశారు.లేనియెడల ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author