రోడ్డు భద్రత.. నియమాలు పాటించండి..
1 min read
– మద్యం సేవించి… డ్రైవింగ్ చేయొద్దు..
- ఆర్టీఓ భరత్ చవాన్
- మినీ లారీ యూనియన్ కార్యాలయంలో 36వ జాతీయ రోడ్డు భద్రత అవగాహన సదస్సు
కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు నగరం కోడుమూరు రోడ్ లోని మినీ లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ కార్యాలయంలో 36వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు. ఆర్టీవో భరత్ చావన్ పర్వేక్షణలో, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, రవీంద్ర కుమార్, ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా 6 చక్రాల లారీ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి , మినీ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రహ్మాండం గౌడ్ హాజరయ్యాడు, అనంతరం ఆర్టీవో భరత్ చావన్ మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతలో తీసుకోవలసిన జాగ్రత్తలపై లారీ మరియు మినీ లారీ వాహనాదారులకు, డ్రైవర్ల కు సూచనలను తెలియజేశారు. లారీ యజమానులకు డ్రైవర్లకు మరియు ఇతర వాహనాదారులకు రోడ్డు భద్రత పై అవగాహన గూర్చి తెలియజేస్తూ, లారీ డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి వాహనాలు నడపాలన్నారు. ఈ కార్యక్రమానికి హెల్మెట్ ధరించి వచ్చిన వారికి ఆర్టీవో బహుమతులు ఇచ్చారు. ప్రమాదాలపై నూతనంగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని ఆర్టీవో తెలిపారు. డ్రైవర్లు భార్యా పిల్లలన్ని కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ వాహనాలు జాగ్రత్తగా నడపాలన్నారు, ముఖ్యంగా డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు,. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ నాగరాజ నాయక్ మాట్లాడుతూ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 2023, 24 లోనే 18, వేల మందికి యాక్సిడెంట్ జరిగాయి. చాలామంది ఆక్సిడెంట్ బారినపడ్డారు దీంట్లో 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కర్నూలు జిల్లాలోనే 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత 6 చక్రాల లారీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం వాహనదారులు మరియు డ్రైవర్లతో రహదారి భద్రత నియమాలు పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మినీ లారీ మరియు సిక్స్ వీలర్ లారీ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ, బ్రహ్మాండగౌడ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బాబు కిషోర్,, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ విజయ భాస్కర్ చలపతి మరియు హోంగార్డులు, లారీ అసోసియేషన్ నాయకులు లారీ యజమానులు, మరియు లారీ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
