ప్రమాదాల నివారణ పై రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం..
1 min read– ఆధునిక పెలికాన్ సిగ్నల్స్, ఐ.టి.ఎస్ సాంకేతికత వినియోగం..
– భద్రత అథారిటీ చైర్మన్ డిజిపి కె.ఆర్.ఎం కిషోర్ కుమార్
– రోడ్డు భద్రతకు తమ శాఖ అధిక ప్రాధాన్యత..జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులపై ప్రమాదాల నివారణకు, భద్రత పెంపొందించడానికి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ చేపట్టిన “రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం” ప్రాజెక్టులో భాగంగా పరిశ్రమల శాఖ చే నియమింపబడిన కన్సల్టెంట్ ఏజెన్సీ రాష్ట్రములో గల సుమారు 13,500 కిలో మీటర్ల రాష్ట్ర రహదారుల యొక్క స్థితిగతులను పరిశీలించి వివిధ ప్రమాణాలను విశ్లేషించి సుమారు 200 కిలో మీటర్ల నిడివి గల మూడు డెమో కారిడార్ లను మరియు 1000 కిలో మీటర్ల అత్యంత ప్రమాదకరమైన రహదారులుగాను గుర్తించి, ఈ ప్రమాదముల నివారణకు సదరు రహదారులపై చేపట్టవలసిన అభివ్రిద్ది పనులు మరియు పాటించవలసిన భద్రతా చర్యలు ప్రతిపాదించడము జరిగినది. ఈయొక్క మూడు డెమో కారిడార్ లలో రెండు పశ్చిమ గోదావరి జిల్లాలోనే కలవు. ఒకటి నరసాపురం నుంచి అశ్వారావుపేట వరకు గల రహదారి మరియు రెండవది ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వరకు గల రహదారి. కనుక, సదరు ప్రతిపాదనలయొక్క ఆవశ్యకత, ముందస్తు ప్రణాళిక మొదలగు విషయములను సంబంధిత శాఖల అధికారులతో చర్చించేందుకు ఏలూరు ఒక ప్రైవేట్ కాన్సర్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించడమైనది. కన్సల్టెంట్ ఏజెన్సీ అయినా అటేన్ ఇన్ఫోట్రాన్స్ మరియు శ్వేతా టెక్నో ఫైల్స్ వారు సదరు డెమో కారిడార్స్ ను గుర్తించుటకు చేపట్టిన విధి విధానాలు ప్రమాద నివారణకు చేపట్టవలసిన కార్యక్రమాల పై వారి సూచనలు, ప్రతిపాదనలను వివరించారు. ఈ సదస్సునకు హాజరయి వారి అమూల్య సలహాలను సూచనలను అందించిన రహదారులు మరియి భవనముల శాఖ, ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖ, రెవిన్యూ శాఖ లకు సంభందించిన అధికారులకు పరిశ్రమ శాఖ తరపున ధన్యవాదములు తెలిపినారు. రాష్ట్ర రహదారులపై జరిగిన ప్రమాదాలు వాటి తీవ్రతను బట్టి ఎంపిక చేయబడ్డ సుమారు 220 కి.మీ. మొత్తంతో మూడు(3) హైవేలను డెమో కారిడార్స్ గాను మరో 1000 కి.మీ. మొత్తంతో 26 హైవేలను హజార్డస్ కారిడార్స్ గాను గుర్తించారు. సదస్సులో 3 డెమో కారిడార్స్ – హైవే 24 నర్సాపూర్ నుండి అశ్వారావుపేట, హైవే 26 ఏలూరు నుండి జంగారెడ్డి గూడెం, హైవే 6 విజయనగరం నుండి పాలకొండ రహదారులపై గుర్తించిన బ్లాక్ స్పాట్ లపై కన్సల్టెంట్స్ చేసిన పరిశీలనలు, రోడ్డు భద్రత పెంపొందించటానికి ప్రతిపాదనలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చాగోష్టి జరిగింది. ఈ ప్రతిపాదనలలో రహదారుల అభివ్రిద్ది పనులతో పాటు, వివిధ భద్రతా పరికరములైన, రవాణా శాఖకు డ్రైవింగ్ సిమ్యులేటర్స్, పోలీస్ వారికి వాహనాలు, లేజర్ గన్స్, బ్రీత్ అనలైజర్స్, ఆరోగ్య శాఖకు స్టేబిలైజేషన్ పరికరాలు ముఖ్యమైనవి . వీటితో పాటు అత్యాధునిక నిఘా కేమెరాలు, ఆటోమేటిక్ వేగ ప్రదర్శన బోర్డ్ మరియు నియంత్రణ కేమెరాలు, పాదచారులకు ఆధునిక పెలికాన్ సిగ్నల్స్ వంటి ఐ. టి. ఎస్. సాంకేతికతను కూడా వినియోగించుకొని ప్రమాద నివారణా చర్యలు ప్రతిపాదించడం జరిగింది.విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివ్రిద్ది ప్రోగ్రాం యొక్క ఆధ్వర్యములో జరిగిన ఈ సదస్సునకు భద్రత అధారిటీ చైర్మన్, డి. జి. పి. కె. ఆర్. ఎం. కిషోర్ కుమార్ అధ్యక్షత వహించిరి. ఈ సదస్సులో జిల్లా ఎస్.పి. మేరీ ప్రశాంతి, అర్ & బి ఎస్.ఈ. భాస్కర రావు, హైవే 24 మరియు హైవే 26 ల పరిధిలోని పోలీస్ అధికారులు, తహశీల్దార్లు, అర్ & బి, మరియు రవాణా శాఖ ఉద్యోగులు పాల్గొని కన్సల్టెంట్స్ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చైర్మన్ కే ఆర్ ఎం కిషోర్ కుమార్ మాట్లాడుతూరోడ్డు భద్రత అందరి సమిష్టి బాధ్యత అని, అన్ని సంస్థలు సమిష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించగలమని, ఇందు నిమిత్తము రోడ్డు భద్రతా సంస్థ ను బలోపేతం చేస్తూ కన్సల్టెంట్స్ ప్రతిపాదించిన బిల్లు త్వరలోనే ప్రభుత్వ ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర పారిశ్రామిక అభివ్రిద్ది కొరకు మౌలిక సదుపాయముల కల్పనలో భాగముగా ఆసియ డెవలప్మెంట్ బ్యాంకు ఆర్ధిక సహాయముతో చేపట్టబడుచున్న విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నందు కమీషనర్, పరిశ్రమ శాఖ వారి ఆధ్వర్యములో రహదారుల భద్రత అవగాహన పెంచటానికి గత రెండు ఏళ్లుగా జరుగుతున్న వివిధ కార్యక్రమములను మరియు కన్సల్టెంట్స్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. జిల్లా ఎస్.పి. మేరీ ప్రశాంతి మాట్లాడుతూ రోడ్డు భద్రతకు తమ శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తుందని, తమ జిల్లాకు సంబంధించిన ఇలాంటి ప్రతిపాదనలకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. జిల్లా ఎస్.ఈ. భాస్కరరావు మాట్లాడుతూ రోడ్డు మరమ్మత్తుల్లో భాగంగా ఈ మధ్యే హైవే 24 మరియు హైవే 26 లను బాగు పరిచామని తెలిపారు. రహదారి భద్రతకై కన్సల్టెంట్స్ చేసిన ప్రతిపాదనలను స్వాగతించారు. పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ గిరిధర్ రావు మాట్లాడుతూ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివ్రిద్ది ప్రోగ్రాం నందు ప్రభుత్వము వివిధ పారిశ్రామిక వాడలను పారిశ్రామికవేత్తలకు అవసరమగు అన్ని అంతర్గత మరియు బాహ్య మౌలిక సదుపాయములు కల్పించుచూ అభివృద్ధి చేయు చున్నదనియు మరియు ఈ పారిశ్రామిక వాడలకు నేషనల్ హైవేస్ నుంచి రహదారి సౌకర్యములను పెంపొందించుచున్నదనియు ఈ యొక్క అభివ్రిద్దిలో భాగముగా రహదారి భద్రత ప్రమాణములు కూడా పెంపొందించవలసివున్నదనియు కనుకనే కమీషనర్ పరిశ్రమల శాఖ ఈ యొక్క రహదారి భద్రత అవగాహనా కార్యక్రమమును గత రెండు సంవత్సరమములుగా చేపెట్టుచున్నారనియు వివరించారు. వివిధ కార్యక్రమములు నిర్వహించుటకై ఒక కేంద్రికుత సంస్థ యొక్క ఏర్పాటు మరియు ఆ సంస్థకు కార్యక్రమ నిర్వహణా అధికారముల కల్పన యొక్క ఆవశ్యకత లను పరిష్కరించుటకై ఒక బిల్ ను రూపొందిచబడుతున్నదనియు మరియు ఆ బిల్లును ప్రభుత్వ ఆమోదముకొరకై నివేదింపబడుతున్నదనియు వివరించారు.