రోడ్డు భద్రత మాసోత్సవం..
1 min readడ్రైవర్లకు, గ్యారేజీ స్టాఫ్ కి కండక్టర్లకు, బస్సు ఫిట్నెస్ పై సూచనలు, సలహాలు..
బస్సును అత్యుత్తమoగా మెయింటైన్ చేసిన డ్రైవర్లకు సత్కారం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రోడ్డు భద్రత 2024 మాసోత్సవంలో భాగంగా గురువారం డిపో మేనేజర్ బి వాణి అధ్యక్షతన స్థానిక ఆర్టీసీ గ్యారేజీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సిస్టంలో వచ్చే లోపాలు బ్రేక్స్, స్టీరింగ్, సస్పెన్షన్, మరియు ఎలక్ట్రికల్ తదితర వచ్చే లోపాలు ఏ విధంగా అరికట్టాలో సూచించారు. డిపిపిఓ ఎన్.వి.ఆర్. వరప్రసాద్, ఎం వి ఐ వీరప్రసాద రావు, డ్రైవర్ అత్యుత్తమైన బస్సును మెయింటెనెన్స్ చేసి ఏ విధంగా ఇవ్వాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్యుత్తమంగా బస్సులు మెయిన్టైన్ చేసిన డ్రైవర్లు నరసింహ, శివరావ్, అవినాష్ నేతాజీ, ధనంజయ, ఎలీషా, రాజు, లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్యారేజీ స్టాప్, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులు, గ్యారేజీ ఇంచార్జ్ ప్రేమ్ కుమార్, సూపర్వైజర్స్ హాజరయ్యారు.