NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి.. ఎస్సై

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: రోడ్డు భద్రత నియమాలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని మంగళవారం నాడు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని వాహనాలను ఓవర్టేక్ చేసేటప్పుడు వేగం తగ్గించుకోవాలని లైసెన్సు మరియు యూనిఫామ్ తప్పకుండా ధరించాలని వాహనాలకు ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చరవాణిలో మాట్లాడుతూ వాహనాలు నడపరాదన్నారు రోడ్డు భద్రత నియమాలను పాటించని రోడ్డు భద్రత నియమాలను పాటించని డ్రైవర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. పోలీసులకు సహకరించాలన్నారు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా వాహనాలు నడపాలని మద్యం తీసుకొని వాహనాలు నడిపితే ఆటో సీజ్ చేస్తామని హెచ్చరించారు.

About Author