రూ.178.61 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభం
1 min read– గ్రామ అభివృద్ధి చెయ్యడమే వైయస్సార్ ప్రభుత్వ లక్ష్యం: ఆర్థిక మంత్రి బుగ్గన
పల్లెవెలుగు, వెబ్ ప్యాపిలి : పట్టణ ,గ్రామ అభివృద్ధి చెయ్యడమే వైయస్సార్ ప్రభుత్వ లక్ష్యం అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.ఈసందర్భంగా శనివారం ప్యాపిలి మండలం వెంగలంపల్లె గ్రామం వద్ద గల 44వ జాతీయ రహదారి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని ఓబులదేవురపల్లె వరకు రూ.178.61 కోట్లతో రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం ప్యాపిలి నుంచి ఓబులదేవురపల్లె వరకు మంత్రి బుగ్గన ఆ రోడ్డుపై పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో ప్యాపిలి ఎం పీపీ గోకుల్ లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు బోరెడ్డి శ్రీరామిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు మెట్టు వెంకటేశ్వరరెడ్డి,రాష్ట్ర మిట్ చైర్మన్ శ్రీరాములు ,మాజీ జెడ్పీటీ సీదిలీప్ చక్రవర్తి ,డోన్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ,ఆర్డిఓ వెంకటరెడ్డి,సిఐ శ్రీరాములు ,ఎస్ ఐ రాకేష్ , ఎంపిడిఓ పాజుల్ రహిమాన్ ,ఎంఆర్ఓ శివరాముడు ,ఆర్ఎఇ ప్రభకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కమతం భాస్కర్ రెడ్డి, చిన్నపూజెర్ల రామచంద్రారెడ్డి,గడ్డం భూవనేశ్వర రెడ్డి ,బోర మల్లికార్జున రెడ్డి ,సర్పంచ్ రంగస్వామి ,పోతుదొడ్డి క్రిష్ణమూర్తి ,రామెశ్వర రెడ్డి ,చిన్న రమాంజీ ,బోరెడ్డి రాము ,బోరెడ్డి రఘనాథ రెడ్డి ,బోరెడ్డి ప్రభకర్ రెడ్డి, బోరెడ్డి క్రిష్ణరెడ్డి ,పోతుదొడ్డి క్రిష్ణమూర్తి ,రామనాయుడు ,మద్దిలేటీ మరియు వైసీపీ నాయకులు,కర్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.