రోడ్డా.. మురుగు కాల్వనా..!
1 min read– అక్కమ్మ సెంటర్లో డ్రైనేజీ లేక.. అస్తవ్యస్థం
పల్లెవెలుగు వెబ్,శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం నియోజకవర్గం సుండిపెంటలోని అక్కమ్మ సెంటర్ ప్రధాన రహదారిపై డ్రైనేజీ వ్యవస్థ లేక అస్తవ్యస్తంగా మారిందని, దీంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు Aiyf మండల అధ్యక్షుడు T మల్లికార్జున. శనివారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అక్కమ్మ సెంటర్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి D.ఓబులయ్య మాట్లాడుతూ అక్కమ్మ సెంటర్ ప్రధాన రహదారిపై చెత్తాచెదారం, మురుగు నిల్వ ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక దోమలు వృద్ధి చెంది.. పిల్లలు, వృద్ధులు, మహిళలు డెంగ్యూ, మలేరియా వ్యాధులకు గురవుతున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ ఏర్పాటు చేసి, పారిశుద్ధ్యం మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AIYF CPI AITUC నాయకులు sk అన్వర్ భాష TSK జాఫర్ ఆలి . T వెంకట్ P పాపమా. Ch డేవిడ్. సాయి. శ్రీనివాసులువిజయ్ బాషా . మాబు. వలి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.