PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రహదారులు.. అద్దంగా మెరవాలి…!

1 min read

– ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి, ఎంఎల్​సీ జకియా ఖానం
పల్లెవెలుగు వెబ్​, కడపబ్యూరో: రహదారుల విస్తరణ, అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి, ఎంఎల్​సీ జకియా ఖానం. రూ.61.40 కోట్ల నిధులతో రాయచోటి- సుండుపల్లె- పించా రహదారి డబుల్ లైన్ రోడ్డు , రూ .31 కోట్ల నిధులుతో రాజంపేట కదిరి తుమ్ముకూరు రహదారి విస్తరణ అభివృద్ధి పనులకు సోమవారం వారితోపాటు మాజీ ఎంఎల్ఏ ఆకేపాటి అమరనాధ రెడ్డి శంకు స్థాపన చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్​ విప్​ శ్రీకాంత్​ రెడ్డి మాట్లాడుతూ జనాభా సంఖ్య, వాహనాల రద్దీ పెరగడంతో రహదారుల అభివృద్ధికి సీఎం జగన్​ మోహన్​ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీని వల్ల రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చు. సుండుపల్లె, రాజంపేట రహదారులు అద్దంలా మెరవాలని, పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు.
ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
సుండుపల్లె, రాజంపేట క్రాస్ రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంఎల్ఏ మేడా మల్లికార్జున రెడ్డి, ఎం ఎల్ సి జకియా ఖానం లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా,వైస్ చైర్మన్ దశరధ రామిరెడ్డి,ఆర్ అండ్ బి ఎస్ ఈ మహేశ్వర రెడ్డి, ఈ ఈ సహదేవ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాషా, జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి, వీరబల్లె మండల కన్వీనర్ రాజేంద్ర నాధ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ విజయ భాస్కర్, హాబీబుల్లా ఖాన్, వండాడి వెంకటేశ్వర్లు,మదన మోహన్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, బీసీ నాయకుడు పల్లపు రమేష్, ఫయాజుర్ రెహమాన్,ఎం పిటి సి రామచంద్రా రెడ్డి, ఆసీఫ్ అలీఖాన్, ఫయాజ్ అహమ్మద్, జాకీర్, కొలిమి హారూన్, అల్తాఫ్, రియాజ్, గువ్వల బుజ్జిబాబు,జిన్నా షరీఫ్, షబ్బీర్, తిరుపాల్ నాయుడు, రియాజుర్ రెహమాన్, సాదిక్ అలీ, సుగవాసి శ్యామ్, కొత్తిమీర ప్రసాద్,జయన్న నాయక్, పల్లా రమేష్,,అన్నా సలీం, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్,జానం రవీంద్ర యాదవ్, మహేష్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, నవరంగ్ నిస్సార్,జావీద్, అమీర్,జుల్ ఫక్కీర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

About Author