NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోబో టెక్నాలజీ కడపకు గొప్ప వరం

1 min read

విద్యాసాగర్ రెడ్డిని ప్రశంసించిన కమలాపురం ప్రజా సేవకుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ

పల్లెవెలుగు వెబ్ కడప : విద్యాసాగర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ లో మోకాళ్లు కీళ్లనొప్పులకు రోబో టెక్నాలజీ ఉపయోగించడం గొప్ప వరమని కమలాపురం నియోజకవర్గ ప్రజానాయకుడు ప్రజా సేవకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు కడప పట్టణంలోని రాజీవ్ పార్క్ రోడ్ లోని మారుతి నగర్ లో విద్యాసాగర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ లో తనంగా ఆదివారం నాడు మోకాళ్లు పిల్లనొప్పుల శాశ్వత పరిష్కారానికి రోబో టెక్నాలజీని ఆసుపత్రి ప్రారంభించడంతో విద్యాసాగర్ రెడ్డి ఆహ్వానం మేరకు సాయినాథ్ శర్మ ఆదివారం మధ్యాహ్నం విద్యాసాగర్ హాస్పిటల్ కు వెళ్ళి రోబో టెక్నాలజీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రోబో టెక్నాలజీ పనిచేసే విధానాన్ని ఆసుపత్రి నిర్వహకులు విద్యాసాగర్ రెడ్డి సాయినాథ్ శర్మకు దగ్గరుండి వివరించారు. కమలాపురం నియోజకవర్గం లో ప్రజలకు వితరణ సేవ చేస్తున్న సాయినాధ శర్మ సహకారం రోగులకుbహాస్పిటల్ కు ఉపయోగపడాలన్నారు. సాయినాథ్ శర్మ వెంట కమలాపురం నియోజకవర్గ అభిమానులు నాయకులు పాల్గొన్నారు. తమ ఆహ్వానం మేరకు ఆసుపత్రికి విచ్చేసిన సాయినాథ్ శర్మను విద్యాసాగర్ రెడ్డి మెమొంటో ఇచ్చి దుశ్శాలవతో సన్మానించారు.

About Author