PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజయవాడ నగరంలో రోబోటిక్ ఎగ్జిబిషన్ సందడి

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: వేసవి ఆటవిడుపు కోసం నగరంలోని బందర్ రోడ్ లో వజ్రా గ్రౌండ్స్ నందు రోబోటిక్ సూపర్ హీరోస్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా విచ్చేసి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. తదనంతరం ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసిన రోబోటిక్ సెట్టింగ్లను ఆయన పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.రోబోటిక్ సూపర్ హీరోస్ ఎగ్జిబిషన్ ను రోబోటిక్ సెట్టింగ్ లతో నగరంలోనే ప్రారంభించారని తెలియజేశారు. ఈ రోబోటిక్ ఎగ్జిబిషన్ వేసవి విడిదిగా ప్రేక్షకులనుఅలరిస్తుందని వెల్లడించారు. రోబోటిక్ సూపర్ హీరోస్ ఆకృతులు ఎగ్జిబిషన్ లో ప్రత్యేకంగా ఆకర్షిస్తాయని వీక్షకులకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయని వెల్లడించారు.తధనంతరంనిర్వాహకులు మాట్లాడుతూ కిరణ్, గోపి మాట్లాడుతూ రోబోటిక్ సెట్టింగ్ విజయవాడ వాసులను ఎంతగానోఅలరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవిలో నగరవాసుల కోసం ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామనిఅన్నారు.సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, అక్వా మ్యాన్ జంగిల్ మ్యాన్,హీమ్యాన్, బ్యాట్ మెన్, వకాండ లేడీ, ట్రాన్సఫార్మర్స్, పవర్ రెంజర్స్, హల్క్ డాక్టర్ స్ట్రెంజ్, కెప్టెన్ అమెరికా బొమ్మలు పిల్లలని ఎంతగానో అల్లరించనున్నాయని పేర్కొన్నారు…ఎగ్జిబిషన్లోని సెట్టింగులు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతగానో ఆకట్టుకోవడంతోపాటు ఆశ్చర్య చెకితులను చేస్తాయని ఆయన పేర్కొన్నారు.రోబోటిక్ ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్, కొలంబస్, టోరాటోరా, బ్రేక్ డ్యాన్స్, చిన్న పిల్లల ఆటవస్తువులు ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేకఆకర్షణగా నిలుస్తూ.. ఇటు చిన్నారులు, అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటూ ఆనందాన్ని పంచుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు.కలకత్తా జైపూర్ ఢిల్లీ మహారాష్ట్ర చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఎగ్జిబిషన్లోప్రదర్శించారనిపేర్కొన్నారు.పాఠశాలలు కళాశాలలకు సెలవుల సందర్బంగా ఈ రోబోటిక్ ఎగ్జిబిషన్ నగరవాసులను ఎంతగానోఅలరిస్తాయని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్ రిహన నాహీద్, నిర్వాహకులు గోపి, భాను అడపా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author