NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విమానాశ్రయం పై రాకెట్లతో దాడి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆఫ్గనిస్థాన్ లోని కాంద‌హార్ అంత‌ర్జాతీయ విమానాశ్రయం పై శ‌నివారం రాత్రి రాకెట్ల దాడి జ‌రిగింది. ఈ విష‌యాన్ని విమానాశ్రయ చీఫ్ మ‌సూద్ ధృవీక‌రించారు. రెండు రాకెట్లు ర‌న్ వేను తాకాయ‌ని తెలిపారు. దీంతో విమాన సేవ‌లు తాత్కాలికంగా నిలిచిపోయాయ‌ని తెలిపారు. ర‌న్ వే బాగు చేసే ప‌నులు వేగంగా సాగుతున్నాయ‌ని, ఆదివారం మ‌ధ్యాహ్నం నాటికి ర‌న్ వే పున‌రుద్దరిస్తామ‌ని తెలిపారు. అమెరికా, నాటో బ‌ల‌గాల నిష్క్రమ‌ణ త‌ర్వాత ఆఫ్గనిస్తాన్ లో మెజారిటీ ప్రాంతాల‌ను తాలిబ‌న్లు ఆక్రమించారు. కాంద‌హార్ ఆక్రమ‌ణ‌కు తాలిబ‌న్లు తీవ్ర య‌త్నం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో 80 శాతం భూభాగం తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లింది. తాలిబ‌న్ల పై దాడికి కాంద‌హార్ విమానాశ్రయం కీల‌కంగా ప‌నిచేస్తోంది. ఈ నేప‌థ్యంలో కాంద‌హార్ విమానాశ్రయం పై తాలిబ‌న్లు దాడులు చేశారు.

About Author