భూమి వైపు దూసుకొస్తున్న రాకెట్..?
1 min read
If you know the signs to look for, it becomes clear that the Earth itself is breathing.
పల్లెవెలుగు వెబ్: చైనాకు చెందిన ఓ రాకెట్ భూమి వైపు దూసుకొస్తోంది. ఆ రాకెట్ శకలాలు భూమి మీద ఎక్కడ పడతాయో స్పష్టంగా చెప్పలేమని సైంటిస్టులు చెబుతున్నారు. జనావాసాల్లో రాకెట్ శకలాలు కూలితే ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. చాలా వరకు రాకెట్ శకలాలు వాతావరణంలోనే భస్మం అవుతాయి. కానీ చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ అనే రాకెట్ పరిమాణం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో .. ఆ రాకెట్ శకలాలు నేరుగా భూమ్మీదకు వస్తాయి. జనావాసాల్లో కంటే సముద్ర జలాల్లో పడే అవకాశం ఎక్కువగా ఉందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతన్నారు. భూవాతారణంలోకి ఈనెల 8న ప్రవేశించే అవకాశం ఉందని సైటింస్టులు అంచనా వేస్తున్నారు. చైనా అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో భాగంగా లాంగ్ మార్చ్ 5బీ అనే రాకెట్ ప్రయోగించింది. ఆ రాకెట్ అంతరిక్ష కేంద్ర కోర్ మాడ్యుల్ ను తీసుకెళ్లింది. అయితే.. కొన్ని కారణాల వల్ల ఆ రాకెట్ నియంత్రణ కోల్పోయి.. భూ వాతావరణం దిశగా దూసుకొస్తోంది.