PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోల్ క‌త‌లో రాకెట్రీ సినిమా నిలిపివేత !

1 min read

ప‌ల్ల‌వెలుగువెబ్ : ప‌్ర‌ముఖ హీరో మాధవన్ న‌టించిన `రాకెట్రీ సినిమాలో మాధ‌వ‌న్ రీయాక్టింగ్‌, డైరెక్షన్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. గొప్ప సినిమా చేశావంటూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉంటే కోల్‌కతాలోని ఓ థియేటర్లో రాకెట్రీ మూవీ ప్రదర్శనను మధ్యలో నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. షో మొదలైన కొద్ది సమయం తర్వాత ఫ్యాన్స్‌కు, థియేటర్‌ యాజమాన్యానికి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మూవీ ప్రదర్శనను మధ్యలోనే నిలిపివేశారు. అనంతరం ఈ సంఘటనపై మాధవన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. కాస్తా నెమ్మదించాలని ఫ్యాన్స్‌ను కోరాడు.

                                         

About Author