PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరి పంట లో ఎలుకల నివారణ చర్యలు

1 min read

– మల్యాల గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  వరి పంటలో  ఎలుకలపై సామూహికంగా నివారణ చర్యలు తీసుకోవడం ఎలా అనే కార్యక్రమాన్ని మండలం లోని  మల్యాల గ్రామంలో మంగళవారం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వ్యవసాయ సహాయ సంచాలకులు  విజయ శేఖర్ , మండల వ్యవసాయ అధికారి షేక్షావలి ,  నందికొట్కూరు టెక్నికల్ ఏఓ  కలిమున్నిసా  నందికొట్కూరు అగ్రికల్చర్ ఆఫీసర్,  గ్రామ సర్పంచి గ్రామ రైతులు పాల్గొన్నారు . ఇందులో ఎలుకల నివారణకు కావలసిన ఎరను తయారు చేసుకునే విధానము రైతులకు వివరించారు . ఎర లో 100 గ్రాములకు గాను 96 గ్రాములు వరి తవుడు, రెండు గ్రాములు నూనె, రెండు గ్రాములు బృమో డైలాన్ మందును కలిపి ఉండలుగా చేసుకొని వరి పొలాల్లో లోని ఎలుకల బోరియల్లో  పెట్టవలేనని సూచించారు . ఇది గ్రామంలోని రైతులందరూ సామూహికంగా చేయడం వల్ల మొత్తం ఎలుకలు నివారించబడతాయన్నారు.  ఒక హెక్టారు కు 10 గ్రాముల ప్రకారం   రైతు భరోసా కేంద్రం  ఆధ్వర్యంలో 100 గ్రాములు పది మంది రైతులకు ఇచ్చి మొత్తం 25 ఎకరాలు కవర్ అయ్యే విధంగా  క్షేత్రస్థాయిలో డెమో ద్వారా రైతులకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో  ఆర్బీకే సిబ్బంది ,రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author