NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోజా ఆడియో .. సోషల్ మీడియాలో వైరల్

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీలో అధికార పార్టీ వైసీపీలో అసమ్మతిపై ఆ పార్టీ కీలక నేత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆడియో ఒకటి సోమవారం కలకలం రేపింది. రోజా మాట్లాడినట్లుగా ఉన్న ఆ వీడియో పలు న్యూస్ ఛానెళ్లలో ప్రసారం కాగా… ఈ వీడియోపై పెద్ద చర్చే జరుగుతోంది. మీడియాలో ప్రసారం అయిన ఆ ఆడియోలో రోజా ఏమన్నారంటే.. ”ఇలాంటి సమయంలో మినిస్టర్ అయిన నన్ను నియోజకవర్గంలో బలహీనపరిచే విధంగా… తెలుగు దేశం, జనసేన వాళ్లు నవ్వుకునే విధంగా.. ఆ పార్టీలకు సపోర్ట్ అవుతూ… నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగజారుస్తూ వీళ్లు భూమి పూజ చేయడం ఎంతవరకు కరెక్టో మీరంతా ఆలోచించాలి. ఇలాంటి వాళ్లు కంటిన్యూ అయితే మేము రాజకీయాలు చేయడం చాలా కష్టం. మేం ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే.. ప్రతిరోజూ మాకు మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా మాకు, పార్టీకి నష్టం జరుగుతుంటే… వీళ్లు పార్టీ నాయకులని ఎంకరేజ్ చేయడం కూడా బాధేస్తోంది” అంటూ రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

              

About Author