యువతకు ఆదర్శం…స్వామి వివేకానంద
1 min readఘనంగా యువ స్పందన సొసైటీ 8వ వార్షికోత్సవం
వృద్ధాశ్రమంలో అన్నదానం
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : యువతకు ఆదర్శం స్వామి వివేకానంద అని, స్వామి వివేకానంద ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పత్తికొండ యువ స్పందన సొసైటీ ఉపాధ్యక్షుడు లక్ష్మన్న, కార్యదర్శి నాగరాజు అన్నారు. జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద జయంతి మరియు యువ స్పందన సొసైటీ 8వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం పత్తికొండ పట్టణంలో సొసైటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక సాయిబాబా దేవాలయం ఆవరణలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి సభ్యులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… స్వామి వివేకానంద స్ఫూర్తితో 2005 సంవత్సర పదవ తరగతి విద్యార్థులు అందరూ కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న ఉద్దేశంతో యువ స్పందన సొసైటీని ఏర్పాటు చేశామని తెలిపారు. 2015 సంవత్సరంలో ఏర్పాటు చేసిన యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. అలాగే తమ సొసైటీ ఆధ్వర్యంలో పత్తికొండ డివిజన్ మరియు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ తో పాటు ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలు, బీసీ బాలికల వసతి గృహం ఏర్పాటుకు అధికారులను రాజకీయ నాయకులను కలిసి కృషి చేశామని తెలిపారు. సేవా కార్యక్రమాలు పత్తికొండ పట్టణంలోనే కాక నియోజవర్గంలో చేస్తున్నామన్నారు. అనంతరం సొసైటీ వార్షికోత్సవ కేక్ ను కట్ చేశారు. తదనంతరం పట్టణంలోని హోసూర్ రహదారిలో ఉన్న రూరల్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో యువ స్పందన సొసైటీ ట్రెజరర్ తులసీదర్ రెడ్డి, సభ్యులు రమేష్, వెంకటరాముడు, ఇస్మాయిల్, అమరేష్, సంజీవ్, ఉదయ్, శ్రవణ్, జావీద్, రాజు, మధు, కేశవ్, యువకులు, వృద్ధాశ్రమం నిర్వాహకురాలు రంగమ్మ, వృద్ధులు, తదితరులు పాల్గొన్నారు.