కాంగ్రెస్ కు రోశయ్య చేసిన సేవలను మారవలేం
1 min read
ఘనంగా రోశయ్య 92 వ జయంతి
పల్లెవెలుగు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15 వ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ పార్టీ కు చేసిన సేవలను మారవలేం అని ఎమ్మిగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాశీం వలి కొనియాడారు.శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొణిజేటి రోశయ్య 92 వ జయంతి ను ఘనంగా నిర్వహించారు.రోశయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాసీం వలి మాట్లాడుతూ ఆర్థిక చాణక్యుడు గా పేరు తెచ్చుకున్న రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కు పని చేశాడు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రజల మనోభాలకు అనుగుణంగా సేవలు అందించారు.ఏపీ రాజకీయాలలో రోశయ్య ది చెరగని ముద్ర.1968 -85 వరకు ఏపీ ఎంఎల్సీ గా ఉంటూ శాసన మండలి ప్రతిపక్ష నేత గా ఉన్నారు.1979 నుండి 1983 వరకు మంత్రివర్గంలో ఉంటూ 1985 నుండి 1989 వరకు తెనాలి ఎమ్మెల్యే గా గెలిచి 1994 వరకు మంత్రిగా సేవలు అందించారు.1998 లో నరసరావుపేట ఎంపి గా , 2004 లో చీరాల ఎమ్మెల్యే గా గెలిచి సేవలు అందించాడు.2004 లో వైస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గా 1 ఏడాది పని చేశారు.2011 నుండి 2016 వరకు తమిళనాడు గవర్నర్ గా పని చేశాడు.దాదాపు 60 ఏళ్ళు ఏపీ రాజకీయాలలో నైతిక విలువలు తో సేవలు అందించిన ఘనత రోశయ్య ది.16 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టీ అందులో 7 సార్లు వరసగా ప్రవేశపెట్టడం గర్వకారణం.అందుకే బహుముఖ ప్రజ్ఞ శాలీగా గుర్తింపు పొందారు. కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నందవరం మాల నరసప్ప, హజరత్ అలీ,రఫీక్ భాష,అజయ్ ,శేఖర్,సోము పాల్గొన్నారు.