రౌడీ యూత్ ను గుర్తించి కఠినంగా శిక్షించాలి: ఎస్పీకి విన్నపం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: 22.4.2023 సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో తాలూకా పోలిస్ స్టేషన్ పరిధిలో బాలాజి విల్లాస్ (పసుపల గ్రామ లిమిట్స్) కాలనీ 45 సంవత్సరాల వయసులో ఉన్న జగదీశ్వర రెడ్డి అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ఎంత దౌర్జన్యంగా అయిదు లేక ఆరు మంది కలిసి ఎలా కొట్టారో చూడండి, ఏమిటీ దౌర్జన్యం అంటూ అడ్డు వచ్చిన వారిని కూడా కొట్టారు. గ్యాస్ సిలిండర్ తీసుకొని కొట్టబోయారు. చుట్టు పక్కల వారు వచ్చి కాపాడారు. లేకుంటే అతనిని గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారు. అదే యువకుల గుంపు బి. తాండ్ర పాడు గ్రామంలో నాగరాజు అనే అతనిపై దౌర్జన్యం చేసి కొట్టారు. అతనికి కూడా రక్త గాయాలు అయ్యాయి. అంతటితో ఆగకుండా తాలూకా పోలిస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో వున్న జి. పుల్లారెడ్డి పాలిటెక్నిక్ కాలేజి హాస్టల్ వాచ్ మెన్ ను, హాస్టల్ లో వున్న విద్యార్థులను కూడా ఈ యువకుల గుంపు ఒక గంట వ్యవధిలోనే మూడు చోట్ల దాడి చేసి గాయపరిచారు.జగదీశ్వర రెడ్డి, నాగరాజు ఇరువురు కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని ఎం. ఎల్. సి చేయించారు. 23.4.2023 ఉదయం దాడికి గురి అయిన ముగ్గురు జగదీశ్వర రెడ్డి, (బాలాజి విల్లాస్), నాగరాజు (బి.తాండ్రపాడు), పుల్లారెడ్డి పాలిటెక్నిక్ కాలేజి హాస్టల్ వాచ్ మెన్, కాలేజి స్టాఫ్ ముగ్గురు బాధితులు తాలూకా పోలిస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అకారణంగా దాడికి పాల్పడి రక్తం వచ్చేలా బాధితులను కొట్టిన రౌడీ యూత్ ను గుర్తించి, అరెస్టు చేసి కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను.