PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌హేష్ పై ప్ర‌శంస‌లు కురిపించిన రోజా.. ఎందుకంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రముఖ సీనియర్​ నటి, వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి మహేశ్​ బాబును పొగడ్తలతో ముంచేత్తారు. మహేశ్​ చేసిన కొత్త పనికి ట్విటర్​లో ప్రశంసలు కురిపించారు. ‘చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేశ్​ బాబుకు హ్యాట్సాఫ్​ చెబుతున్నాను’ అని ఓ వీడియోను పోస్ట్​ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్​ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది. పలువురు చిన్నారులకు హార్ట్‌ సర్జరీలు చేయించిన మహేశ్​ తాజాగా ‘ప్యూర్​ లిటిల్ హార్ట్స్’​ ఫౌండేషన్​కు శ్రీకారం చుట్టారు. ఆర్థికంగా స్థోమత లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఈనేప‌థ్యంలో ప‌లువురు మ‌హేష్ ను మెచ్చుకుంటున్నారు.

                                            

About Author