ఆర్ పి ఐ’ పార్టీ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర సమావేశం
1 min read: అమీన్ భాయ్
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: భారత రాజ్యాంగ నిర్మాత’ బాబా సాహెబ్’ భారతరత్న, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా 1956 సంవత్సరంలో స్థాపించిన “రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (అంబేద్కర్). 67 వార్షికోత్సవం మరియు 2024 లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అభ్యర్దుల ప్రకటన అంశాలపైరాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం విజయవాడ, గాంధీనగర్, ప్రెస్ క్లబ్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్ లాల్ పాటిల్ హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ లోని 175 స్థానాలకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ( అంబేద్కర్) పోటీ చేస్తుందని తెలిపారు. సమాజం లో రాజకీయ అధికారానికి, అణిచివేతకు దూరమైన వారిని ముందుకు తీసుకురావడానికి పార్టీ కృషి చేస్తుందని చెప్పారు.ఈ సందర్బంగా రాష్ట్ర ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు అమీన్ భాయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రజలను మోసం చేస్తున్నారని, రాబొవు 2024 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా అభ్యర్దులను ఎన్నిక జరుగుతుంది అని, గెలుపు గుర్రలను సిధ్ధం చేస్తున్నట్టు తెలుపారు, రానున్న ఎన్నికల్లో గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్దిగా పోటీ చేస్తానని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ‘ మేక వెంకటేశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికిజాతీయ అదనపు కార్యదర్శి పిట్ట వరప్రసాద్,అంజయ్య, కల్యాణ రావు,డేవిడ్ రాజు, మోహన రావు, నాగ మల్లి రాజు, అర్జున్, శ్రీనివాస రావు, ముస్తక్ భాయ్, ప్రభాకర్, మోజెస్, పూర్ణిమ, మరియు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.