PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్పీలకు ‘పథకాల’పై అవగాహన ఉండాలి: మెప్మా పీడీ

1 min read

ఆదోని మెప్మా ఆర్పీలకు ప్రత్యేక శిక్షణ తరగతులు

పల్లెవెలుగు:పొదుపు సంఘాల గ్రూపు సభ్యులకు  ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే…. ఆర్పీలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు ప్రాజెక్టు డైరెక్టర్​ నాగశివలీల. మంగళవారం ఆదోని మెప్మా ఆర్పీలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ నాగశివలీల మాట్లాడుతూ పొదుపు మహిళలు తీసుకున్న రుణం తిరిగి బ్యాంకర్లకు చెల్లించేలా చూసుకోవాలని, అప్పుడే బ్యాంకర్లు మళ్లీ రుణ సౌకర్యం కల్పిస్తారని వారికి వివరించాలన్నారు. వైఎస్సార్​ ఆసరా,  వైఎస్సార్​ సున్నా వడ్డీ, వైఎస్సార్​ చేయూత, జగనన్న తోడు, జగనన్న నగర్​ మరియు పేదలందరికీ ఇళ్లు తదితర సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించి… వారికి లబ్ధి చేకూర్చడంలో ఆర్పీలదే కీలకపాత్ర అన్నారు.  ఆర్పీలు క్రమ శిక్షణతో పొదుపు మహిళల బుక్​ రికార్డు మెయింటెన్​ చేయించాలని, ఎప్పుడూ పొదుపు మహిళలకు అందుబాటులో ఉండాలని  ఈ సందర్భంగా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్​ నాగశివలీల వెల్లడించారు. శిక్షణ కార్యక్రమంలో ఏఓ నాగరాజు, ఐబీ మురళీ, ఎల్​హెచ్​ జిలాని తదితరులు పాల్గొన్నారు.

About Author