సీఐడీ అదనపు డీజీకి లీగల్ నోటీసు ఇచ్చిన ఆర్ఆర్ఆర్
1 min read
పల్లెవెలుగు వెబ్: ఏపీ సీఐడీ అదనపు డీజీకి ఎంపీ రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది లీగల్ నోటీసు పంపారు. రఘురామ అరెస్టు సమయంలో తీసుకున్న వస్తువులను మెజిస్ట్రేట్ వద్ద జమచేయాలని మంగళగిరి సీఐడీ ఎస్ హెచ్వోకు నోటీసు పంపారు. ఎంపీని అరెస్టు చేసే సమయంలో ఆయన మొబైల్ తీసుకెళ్లారని పేర్కొన్నారు. అందులో విలువైన సమాచారం ఉందని రఘురామ తరపు న్యాయవాది తెలిపారు. మొబైల్ కోడ్ ఓపెన్ చేయాలని కస్టడీలో హింసించారని ఆరోపించారు.