NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమిత్ షా తో ఆర్ఆర్ఆర్ భేటీ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు భేటీ అయ్యారు. ర‌ఘురామ మంగ‌ళ‌వారం అమిత్ షా చాంబ‌ర్ కు వెళ్లి మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. రఘురామ ఆరోగ్య ప‌రిస్థితిని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. అంత‌కుమునుపు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ర‌ఘురామ‌కృష్ణరాజు రాజ‌ధాని పోరాటంలో అమ‌రులైన రైతుల కుటుంబాల‌కు సీఎం జ‌గ‌న్, మంత్రి బొత్స వంటి వారు క్షమాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అమ‌రావ‌తిలో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జ‌ర‌గ‌లేద‌ని, సుప్రీం ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తామ‌న్నారు. నిజ‌మైన ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ విశాఖ‌లో జ‌రిగింద‌ని ఆరోపించారు. రెండేళ్లుగా పార్లమెంట్లో గొంతు విప్పని ఎంపీలు.. త‌న అన‌ర్హత గురించి మాట్లాడుతున్నార‌ని, అది జ‌ర‌గ‌ద‌ని వ్యాఖ్యానించారు.

About Author