PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RRR సోమవారం విడుద‌ల‌.. !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: న‌ర‌సాపురం వైసీపీ ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ రాజు సోమ‌వారం విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. నిన్న సుప్రీం కోర్టు ఆయ‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కు సంబంధించిన సుప్రీం ఆదేశాలు ఎంపీ న్యాయ‌వాదుల‌కు అంద‌ని నేప‌థ్యంలో విడుద‌ల ఆల‌స్యం కానుంది. దీంతో న్యాయవాదులు కింది కోర్టులో పూచిక‌త్తు స‌మ‌ర్పించే ప‌నిలో ఉన్నారు. ర‌ఘురామ‌కృష్ణరాజు ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం క‌లిగేలా ఎంపీ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఏపీ సీఐడీ పోలీసులు ర‌ఘురామ‌కృష్ణరాజును అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.

About Author