‘కోవిడ్’మృతుల కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలి
1 min read– కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ అల్లా బకాష్ (సిఎల్పీ)
పల్లెవెలుగు,రాయచోటి: కరోనా కష్టకాలంలో సొంత లాభం కొంత మానుకుని.. తమకు తోచిన సహాయ సహకారాలు పేదలకు చేయాలని కాంగ్రెస్ రాయచోటి ఇంచార్జ్ ఎస్ అల్లాబకాష్ (సీఎల్పీ) పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెకండ్‌వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ బారిన పడిన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వారికి నిత్యావసర సరుకులు, శానిటైజర్, మాస్కులు, అన్నదానం తదితర సహకారం అందించేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాతోపాటు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన విధంగా రేషన్‌కార్డు ఉన్న రూ.5 వేలు ఇచ్చి ఆదుకోవాలని అల్లాబకాష్ కోరారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు యహియ భాష, కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్, షాజహాన్ బాషా, డీసీసీ కిసాన్ సెల్ చెన్నై కృష్ణ పాల్గొన్నారు.