కచ్చిడి చేప రూ.2.90 లక్షలు.. ఎందుకంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : తూర్పుగోదావరి జిల్లా పల్లిపాలెం చేపల రేవులో 25 కేజీలున్న మగ కచ్చిడి చేపను నర్సాపురానికి చెందిన ఓ వ్యక్తి రూ.2.90 లక్షలకు దక్కించుకున్నాడు. మగ చేప బంగారు వర్ణంతో ఉండటంతో దీనిని బంగారు చేప అని కూడా పిలుస్తారు. ఈ చేప ధర అధికంగా ఉండటానికి కారణం దీనిని గాల్‌బ్లాడర్‌ను ఆపరేషన్ సమయంలో కుట్లు వేసే దారం తయారీలో, బలానికి వాడే మందులు తయారీలోనూ ఉపయోగిస్తారు. అందుకే ఈ చేపకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఖరీదైన వైన్ తయారీలోనూ ఈ చేప శరీర భాగాలను వినియోగిస్తారట. అందుకే ఈ కచ్చిడి చేపను గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తారు.
,