PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ. 2లక్షల 40వేల కోట్లు లబ్దిదారుల ఖాతాలకు జమ…

1 min read

– పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు చేరువలో ప్రభుత్వ సేవలు..

– రూ. కోటి 37 లక్షల వ్యయంతో చేపట్టిన పనులకు ప్రారంభం,శంఖుస్ధాపన..

– రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామంత్రి ధర్మానప్రసాదరావు…

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల్లో 2 లక్షల 40 వేల కోట్లు రూపాయలు పేదవారి సంక్షేమం కింద వారి అకౌంట్ కి జమ చేయడం జరిగిందని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామంత్రి ధర్మానప్రసాదరావు వెల్లడించారు.  శనివారం దెందులూరు-2 ఎస్ఎంఆర్ సైట్ లో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు రూ.43.60 లక్షలు వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనం, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు రూ. 23.94 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, రూ. 70 లక్షలతో దెందులూరులోని వెలమ సెంటరు నుండి వైఎస్ఆర్ జగనన్న కాలనీ వరకూ తారురోడ్డు పనులనకు  రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామంత్రి ధర్మానప్రసాదరావు, జెడ్పి చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, దెందులూరు శాసన సభ్యులు కొఠారు అబ్బయ్యచౌదరి, ఎంఎల్ సి రఘరాజు లతో కలిసి మంత్రి ప్రారంభం, శంఖుస్ధాపన చేశారు.  ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామంత్రి ధర్మానప్రసాదరావు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల్లో పేదల సంక్షేమానికి 2 లక్షల 40 వేల కోట్లు వారి అకౌంట్ కి చేర్చడం జరిగిందని తెలిపారు.  ప్రభుత్వం చిత్తశుద్ధితో పేద ప్రజల ఆశయాలకు అనుగుణంగా సంక్షేమ ఫలాలు అందించేందుకు నాలుగున్నర సంవత్సర కాలంలో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగిందని అందులో పరిపాలనా వికేంద్రీకరణ ఒకటి అని ఇందులో భాగంగానే సచివాలయాలు, రైతు భరోసా, హెల్త్ క్లీనిక్ భవనాలు, నిర్మించి వాటిలో అవసరమైన సిబ్బందిని నియామకం చేసి పూర్తిచేయడం జరిగిందని తెలిపారు.  ప్రభుత్వం వచ్చిన నాలుగున్నర సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడినప్పటికీ, ఏ ఒక్క సంక్షేమ పధకాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా  అమలు చేశామని చెప్పారు.  గ్రామాల్లో కొత్త భవనాలు నిర్మాణం గొప్పమార్పునకు నాందని చెప్పారు.  సచివాలయాల్లో 2 లక్షల మంది ఉద్యోగస్తులను నియామకం చేయడంజరిగిందని ఇది పూర్తిగా మెరిట్ అధారంగా, అవినీతి రహితంగా ఎక్కడా ఆరోపణలులేకుండా నియమించడం జరిగిందని చెప్పారు.  ఎన్నో సంవత్సరాలుగా పరిపాలనా వికేంద్రీకరణలో గత ప్రభుత్వాలు చాలా పద్దతులు అవలంబించినా ప్రజలకు మేలు జరగలేదని గ్రామ సచివాలయాల వ్యవస్ధ వచ్చినతరువాత తహశీల్దారు, యంపిడిఓ కార్యాలయాలు ప్రజలుమరచిపోయారని అన్నారు.  అన్ని సంక్షేమకార్యక్రమాలు తమ సొంత గ్రామంలోనే సచివాలయాల ద్వారా సేవలు పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం కొత్త సాంకేతిక మార్గాలను అన్వేషించి ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేసి సకాలంలోప్రజలకు సేవలు అందించడానికి చర్యలు తీసుకుందని చెప్పారు.  సంక్షేమ పధకాల్లో ఎటువంటి అవినీతి జరుగకుండా పాలనాతీరును మెరుగుపరచి లబ్దిదారుల  మహిళల ఖాతాలకు సంక్షేమ ఫలాలను వేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో విద్యాపరంగా రాష్ట్రం వెనుకబడివుందని కార్పొరేట్ విద్య సంస్థలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను నిర్లక్ష్యం చేసారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదపిల్లవాడు ప్రభుత్వ ప్రోత్సాహంతో విద్యనభ్యసించే విధంగా నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక సౌకర్యాలను కల్పించారని తెలిపారు. వాలంటరీ వ్యవస్ధ ద్వారా కరోనాలో వారు చేసిన సేవలు మరువలేనిదని, మన రాష్ట్రంలో అమలు జరుగుతున్న   వాలంటరీ వ్యవస్ధ  ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. స్ధానిక శాసన సభ్యులు కొఠారు అబ్బయ్యచౌదరి ఇంజనీరింగ్ చేసి విదేశాల నుంచి వచ్చి దెందులూరు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమని అన్నారు.  శాసన సభ్యులు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లుతెలిపారు. కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పధకాలు అందించడంలో నూరుశాతం విజయం సాధించారని అన్నారు.  రాబోయే రోజుల్లో  మరిన్ని పధకాలు ప్రవేశపెట్టడం వాటిని పకడ్బందీగా అమలుచేయడం వంటి ధృఢసంకల్పంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దెందులూరు శాసన సభ్యులు కొఠారు అబ్బయ్యచౌదరి, మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో 11 వేలు ఇండ్లస్ధలాలు ఇచ్చామని తెలిపారు.  ఇంకా సుమారు 400 ఇండ్లస్ధలాలు ఇవ్వవలసియున్నదని దీనికి 9 ఎకరాలు అసైన్డ్ మెంట్ భూమికింద కొనుగోలు చేయడానికి ప్రతిపాధనలు పంపామని చెప్పారు.  నియోజకవర్గంలోని పెదవేగిలో ఎస్సీ, బి.సి. రైతులు 1955 నుంచి 3 తరాల నుంచి సాగుచేసుకుంటున్నారని వారికి పట్టాలు మంజూరు చేయించాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.  జగనన్న ప్రభుత్వం మాట ఇస్తే అమలు చేసే సంకల్పం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్దికే ఉందని అన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి డ్వాక్రా రుణాలను మాఫీచేశారని తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామంత్రి ధర్మానప్రసాదరావు వారికి ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కృతజ్ఞతలు తెలిపారు.  అనంతరం అసైన్డ్ భూముల పట్టాలను రైతులకు మంత్రి, యం.పి., ఎమ్మెల్యే,జెడ్పిచైర్మన్ చేతుల మీదుగా అందజేశారు.  కార్యక్రమంలో యంపిపి బొమ్మనబోయిన సుమలత, సర్పంచ్ తోట ఏసమ్మ, జెడ్పిటిసి నిట్టా నీలానవకాంతం, యంపిటిసి తాళ్లూరి నాగరాజు, రామచంద్రరావు, ఎఎంసి చైర్మన్ అప్పన్న ప్రసాద్, వేదకుమారి, జెడ్పి సిఇఓ కె.ఎస్.ఎస్. సుబ్బారావు, ఆర్డిఓ ఎన్.ఎస్.కె. ఖాజావలి, వ్యవసాయశాఖ జెడి వై.రామకృష్ణ, తహశీల్దారు నాంచారయ్య వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, సచివాలయాల వాలంటీర్లు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, యంపిటిసిలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author