బాధిత కుటుంబానికి రూ. 2 లక్షలు మంజూరు
1 min readపల్లెవెలుగువెబ్, విజయవాడ: నూజివీడు బాలుర గిరిజన సంక్షేమ వసతి గృహంలో వంట మనిషిగా పని చేస్తూ గత నెల 21 న మరణించిన జి. ప్రసాదరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ హామీ ఇచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో వంట మనిషి ప్రసాదరావు భార్య జి. విజయలక్ష్మికి కలెక్టర్ అంతియాజ్ రూ. 2లక్షల ఎక్స్ గ్రేషియా ఉత్తర్వులు అందజేశారు. దినసరి కూలీగా వసతి గృహంలో పనిచేస్తు మరణించిన ప్రసాదరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(సంక్షేమం) కె.మోహన్ కుమార్,జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రుక్మాందయ్య తదితరులు పాల్గొన్నారు.