PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ. 20 కోసం 22 ఏళ్ల న్యాయ‌పోరాటం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉత్తర ప్రదేశ్ కు చెందిన తుంగనాథ్‌ చతుర్వేది అనే న్యాయవాది 1999 డిసెంబర్‌లో మొరాదాబాద్‌కు రెండు టిక్కెట్లను కొనుగోలు చేశారు. అప్పుడు ఆ టిక్కెట్‌ ధర రూ.70 కాగా టిక్కెట్‌ గుమస్తా అతని దగ్గర నుంచి రూ.90లు వసూలు చేశాడు. చతుర్వేది గమస్తాకి రూ.100 ఇస్తే తనకు రూ.30లు తిరిగి వస్తుంది కదా అనుకున్నారు. తీరా చూస్తే రూ. 10 చేతిలో పెట్టి అంతే వస్తుందని చెప్పి వెళ్లిపోయాడు. ఈ ఘటన డిసెంబర్‌ 25, 1999న చోటు చేసుకుంది. చతుర్వేది అతనిని ప్రశ్నించడమే కాకుండా ఈ విషయమై స్టేషన్‌ మాస్టర్‌ని కూడా కలిశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆయన న్యాయం కోసం భారత రైల్వేకి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడూ ఏం చేయాలో అతనికి తెలుసు. పైగా అతను లాయరు, న్యాయ పరిజ్ఞానం మీద అవగాహన కలిగిన వ్యక్తి కావడం చేత ఈ విషయమై కోర్టులో కేసు వేశారు. ఆయన ఈ కేసు విషయమై సుమారు 22 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఎట్టకేలకు కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడమే కాకుండా తక్షణమే రైల్వే శాఖ రూ.15,000 చెల్లించాలని ఆదేశించింది.

                                       

About Author