బాధిత కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సాయం
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి: రాయచోటి పట్టణంలో నివాసముంటున్న ఫాతిమాబి W/O లేట్ కలందర్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు ద్వారా శుక్రవారం ఉదయం స్థానిక మండిపల్లి భవన్ లో పాతిమాబి రూ.5వేలు నగదు అందజేశారు. ఈ సందర్భంగా రాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గం లోని పేదవారికి తమ ట్రస్ట్(మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్)ద్వారా శక్తివంచన లేకుండా సహాయం చేయడానికి ఎల్లవేళలా ముందుంటానని తెలియజేశారు.