NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘మహానంది’కి రూ. కోటి 53లక్షలు ఆదాయం

1 min read
వేలంపాట నిర్వహిస్తున్న ఆలయ ఈఓ, సిబ్బంది

వేలంపాట నిర్వహిస్తున్న ఆలయ ఈఓ, సిబ్బంది

పల్లెవెలుగు వెబ్​, మహానంది: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానంది దేవస్థానానికి వేలాల ద్వారా రూ. కోటి 53 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ జి. మల్లికార్జున తెలిపారు. టోల్గేట్ నిర్వహణకు ఒక కోటి మూడు లక్షలు , తిమ్మాపురం గ్రామానికి చెందిన ఒంటెద్దు వీరారెడ్డి, నవగ్రహాల వద్ద దీపారాధన వస్తువులు అమ్ముకోవడానికి రూ.40 లక్షలు, నంది విగ్రహం వద్ద ఫోటోలు తీసుకునే హక్కు కు సంబంధించి రూ.10 లక్షలకు శివ అనే వ్యక్తి దక్కించుకున్నట్లు ఈఓ వెల్లడించారు.
ఆలయ ఆదాయానికి గండి : మహానంది దేవస్థానం పరిధిలోని టోల్గేట్ నిర్వహణకు గతంలో ఒక కోటి 22 లక్షలు ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.19 లక్షలు తక్కువకు రావడంతో దేవస్థాన ఆదాయానికి గండి పడింది. నవగ్రహాల వద్ద పూజ సామాగ్రి విక్రయాలకు సంబంధించి గత ఏడాది 50 లక్షలు టెండరు పోగా… నేడు పది లక్షలు తక్కువగా పాట పాడడం తో ఇక్కడ కూడా దేవస్థానానికి ఆదాయం పడిపోయింది. దాదాపు 30 లక్షల రూపాయలు పైనే ఆదాయం కోల్పోయినట్లే అయింది. కాంట్రాక్టర్లు రింగ్ కావడం వల్లే ఇలా జరిగిందని ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ వేలంలో ఏఈవో ధనుంజయ సూపరింటెండెంట్​ ఈశ్వర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author