NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దివ్యాంగుల పింఛన్లు 6వేల రూ. పెంచాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన అనగా బేస్తవారము ఉదయం 10 గంటలకు నంద్యాల స్థానిక తాసిల్దార్ కార్యాలయం వెనుక నిశాంతి భవనం నందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగుల పింఛన్ల పెంపు గురించి మరియు వికలాంగుల పలు సమస్యలపై చర్చించుకోవడానికి రాష్ట్ర అధ్యక్షులు చిన్న సుబ్బయ్య యాదవ్  వస్తున్నారు.

1. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలకు పెంచాలి.

2. వికలాంగులకు ఇంటి స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలి.

3. వికలాంగులకు ౩౦౦ యూనిట్ల వరకు కరెంటు ఉచితముగా ఇవ్వాలి.

4. వికలాంగులకు APSRTC అన్ని బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించాలి 

5. వికలంగులందరికి అన్తోదయ కార్డులు మంజూరు చేయాలి.

6. వికలాంగునికి వికలాంగురాలికి వివాహంతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉన్న కుటుంబంగా పరిగణించి రేషన్ కార్డులు ఇవ్వాలి

7. వికలాంగుల కు బ్యాంకు రుణాలు రూ. 5,00,000 లు మంజూరు చేయాలి.

 ఈ కార్యక్రమానికి జిల్లాలోని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు నంద్యాల జిల్లా అధ్యక్షులు, k.గంగాధర్ శెట్టి మరియు అబ్దుల్ రవూఫ్ ఇంతియాజ్, రహంతుల్ల. నురుల్లమీన్. ఎల్లమ్మ, ముక్తరుణ్, సుంకమ్మ, మాలి , అన్వర్, స్వమన్న శివమ్మ విజయ్ నాయక్ తదితరులు కలిసి పాల్గొన్నారు. జై మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి.

About Author