ఒక్కో రైతుకు రూ. 7 లక్షలు ఇవ్వాలి : నారా లోకేష్
1 min readపల్లెవెలుగువెబ్ : అన్నదాతలను ఆదుకోవాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. రైతులు క్రాప్‌హాలీడే విరమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో.. క్రాప్‌హాలీడే వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. ‘‘కడప జిల్లాలో నీరు పుష్కలంగా ఉన్నా గతేడాది నుంచి రైతులు పంట విరామం కొనసాగిస్తున్నారు. గోదావరి జిల్లాలు, అనంతపురం, కర్నూలు, నెల్లూరులో పలు ప్రాంతాల్లో ఇప్పటికే పంట విరామం ప్రకటించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 5 లక్షల ఎకరాల్లో మిర్చి వేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వకపోవడం దారుణం. మా ప్రభుత్వ హయాంలో ధాన్యం బకాయిలు వారంలోనే చెల్లించగా, నేడు 3 నెలలు దాటినా బకాయిలు చెల్లించకపోవడం రైతు ద్రోహం కాదా? ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ.7 లక్షలు ఇవ్వాలి. పంట నష్టపరిహారం చెల్లించాలి“ అని నారా లోకేష్ అన్నారు.