ఉద్యోగులకు రూ. 700 కోట్ల విరాళం
1 min readపల్లెవెలుగువెబ్ : జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయెల్ ఏకంగా రూ. 700 కోట్లను డొనేషన్‌గా ఇవ్వనున్నారు. జొమాటో డెలివరి పార్ట్‌నర్స్ ఇద్దరు పిల్లలకు చదువు చెప్పించడానికి రూ. లక్ష చొప్పున కేటాయిస్తుంది కంపెనీ. అయిదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న వారు దీనికి అర్హులు. పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకుని ఉంటే వారి ఇద్దరు పిల్లల చదువు కోసం రూ. 2 లక్షల అందించనున్నారు. 5/10 ఏళ్ల సర్వీసు ఉన్న మహిళా ఫుడ్ డెలివరీ పార్ట్‌నర్స్ కోసం అదనపు సౌకర్యాన్ని కల్పించింది. పన్నెండవ తరగతి పూర్తి చేసుకున్న బాలికల కోసం ప్రైజ్ మనీని ప్రవేశపెట్టింది. ఉద్యోగులు, సిబ్బంది పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా స్కాలర్‌షిప్ వ్యవస్థను కంపెనీ ప్రవేశపెట్టనుంది. విధి నిర్వహణలో ఉంటూ ప్రమాదానికి గురైన ఫుడ్ డెలివరీ పార్ట్‌నర్స్ కుటుంబాలను ఆదుకోవడానికి, వారి పిల్లల చదువుల కోసం కూడా ఈ రూ. 700 కోట్ల నుంచి వ్యయం చేయనున్నట్లు తెలిపింది జొమాటో కంపెనీ.