రూ. 27 వేల కోట్ల అప్పు కోరిన ఏపీ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం అప్పు చేసేందుకు కేంద్రప్రభుత్వాన్ని అనుమతి కోరింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి మరో రూ.27 వేల కోట్లు అప్పులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అనుమతి కోరందని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. బహిరంగ మార్కెట్లో రూ.27 వేల కోట్లు అప్పు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారని కేంద్ర ఆర్ధిక శాఖ పేర్కొంది. 2021- 22 సంవత్సరానికి గాను రూ. 27,325.78 కోట్ల అప్పులు బహిరంగ మార్కెట్లో చేసేందుకు రాజ్యాంగంలోని 293(3) నిబంధన కింద అనుమతి ఇవ్వాలని.. డిసెంబర్ నెలలో జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది.