NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రూ. 3520 కోట్లు స్వాహా చేసిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ !

1 min read
         ప‌ల్లె వెలుగు వెబ్ :     కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ మోసాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇన్వెస్ట‌ర్ల షేర్లు త‌మ‌వేనంటూ వివిధ బ్యాంకుల్లో కార్వీ సంస్థ ఎండీ సి. పార్థ‌సార‌థి రుణాలు తీసుకున్న‌ట్టు పోలీసులు అభియోగ పత్రం న‌మోదు చేశారు. కార్వీ అక్ర‌మాల పై హైద‌రాబాద్ సెంట్ర‌ల్ క్రైమ్ పోలీసులు నాంప‌ల్లి కోర్టులో అభియోగ‌ప‌త్రాలును స‌మ‌ర్పించారు. ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. సంస్థ ఎండీ పార్థ‌సార‌థితో స‌హా 8 మందిని అరెస్టు చేశారు. పార్థ‌సార‌థి ప్ర‌స్తుతం బెంగ‌ళూరు జైల్లో ఉన్నాడు. కార్వీ సంస్థ‌లోని 2ల‌క్ష‌ల షేర్లు త‌మ‌వేనంటూ ఇండ‌స్ ఇండ్ , హెచ్ డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి 8 ఏళ్ల క్రితం వేర్వేరుగా రుణాలు తీసుకున్నాడు.

        

About Author