NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రూ. 5 వేలు ఇచ్చి.. ల‌క్ష‌ల్లో వ‌సూళ్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇన్‌స్టంట్‌ లోన్‌ పేరుతో.. చైనా కేంద్రంగా సాగుతున్న దా‘రుణ’ యాప్‌ల రాకెట్‌పై ఢిల్లీ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఈ నె ట్‌వర్క్‌కు చెందిన 22 మంది నిందితులను అరెస్టు చేశారు. రూ. 5 వేలు.. రూ. 10వేలు.. ఇలా చిన్న మొత్తాల్లో రుణాలిచ్చే ఈ ముఠా.. రుణగ్రహీతలను బెదిరించి.. రూ. లక్షల్లో వసూలు చేస్తోంది. ఈ గ్యాంగ్‌ గడిచిన ఏడు నెలల్లో రూ. 500 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వీరిదా‘రుణా’లు రూ. 2,000 కోట్ల నుంచి రూ. 2,500 కోట్లకు పైగానే ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్‌ వింగ్‌ ఇం టెలిజెన్స్‌ ఫ్యూజన్‌ స్ర్టాటెజిక్‌ ఆపరేషన్‌ డీసీపీ కేపీఎస్‌ మల్హోత్రా కథనం ప్రకారం.. చైనా కేం ద్రంగా సాగుతున్న ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ల బాధితుల నుంచి వందల ఫిర్యాదులు రావడంతో.. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

                                               

About Author