రూ. 500 ఇస్తే జైలుకు వెళ్లొచ్చు !
1 min readపల్లెవెలుగువెబ్: రిమాండ్ ఎదుర్కొనే నిందితులు, కోర్టులో శిక్ష పడిన దోషులు జైలుకు వెళతారన్న సంగతి తెలిసిందే. అయితే ఉత్తరాఖండ్ లోని ఈ జైలుకు ఏ నేరం చేయకపోయినా వెళ్లొచ్చు. అంతేకాదు, ఆ జైలులో ఒకరాత్రి గడపొచ్చు. అందుకు రూ.500 చెల్లిస్తే చాలు… ఆ జైలు అధికారులే తగిన ఏర్పాట్లు చేస్తారు. ఈ జైలు హల్ద్వానీలో ఉంది. అనేక నేరాలకు పాల్పడినవారు ఇక్కడ ఖైదీలుగా ఉన్నారు. హల్ద్వానీ పట్టణానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. వారిని ఆకట్టుకుని, నిజమైన జైల్లో ఎలా ఉంటుందో వారికి అనుభూతిని అందించేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. హల్ద్వానీ జైలు చాలా పురాతనమైనది. బ్రిటీష్ హయాంలో 1903లో కారాగారాన్ని నిర్మించారు. ఇందులో సిబ్బందికి కొన్ని క్వార్టర్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడవి వాడకంలో లేవు. జైల్లో గడపాలనుకునే పర్యాటకుల కోసం ఇప్పుడీ క్వార్టర్స్ ను ముస్తాబు చేస్తున్నారు.