NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రూ. 17 ల‌క్ష‌ల కోట్ల‌కు భార‌త ఐటీ ప‌రిశ్ర‌మ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఐటీ సేవల రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని నాస్కామ్‌ తాజా నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో దేశీయ ఐటీ పరిశ్రమ మొత్తం ఆదాయం 15.5 శాతం వృద్ధి చెంది సుమారు రూ.17 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. అంటే, గత ఆర్థిక సంవత్సరం 2020-21లో నమోదైన 19,400 కోట్ల డాలర్లతో పోలిస్తే, ఈసారి ఆదాయం 3,300 కోట్ల డాలర్ల మేర పెరగనుంది. దశాబ్ద కాలంలో ఐటీ రంగానికిదే అత్యధిక ఆదాయ వృద్ధి. అంతేకాదు, ఇండస్ట్రీ వార్షికాదాయం రూ.15 లక్షల కోట్లు దాటనుండటం కూడా ఇదే తొలిసారి. క‌రోన సంక్షోభం కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా డిజిట‌ల్ సేవ‌ల‌కు డిమాండ్ పెరిగింది. ఈ నేప‌థ్యంలో ఐటీ ప‌రిశ్ర‌మ అభివృద్ధి శ‌ర‌వేగంగా సాగుతోంది.

                                        

About Author