NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీఎస్పీలోకి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : వాలంట‌రీ రిటైర్మెంట్ తీసుకున్న ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బ‌హుజ‌న స‌మాజ్ పార్టీలో చేర‌నున్నారు. ఆగ‌స్టు 8న న‌ల్గొండ ఎన్ జి క‌ళాశాల మైదానంలో జ‌ర‌గనున్న బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న బీఎస్పీలో చేర‌నున్నారు. బీఎస్పీ రాష్ట్ర స‌మ‌న్వయ‌క‌ర్త రాంజీ గౌతం స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీ కండువా కప్పుకుంటారు. ఈ కార్యక్రమానికి గురుకులాల మాజీ విద్యార్థులు, అభిమానులు హాజ‌రుకానున్నారు. ప‌లు జిల్లాల్లో ప‌ర్యటించి స్వేరోస్ ప్రతినిధుల‌తో , కార్యక‌ర్తల‌తో మాట్లాడిన త‌ర్వాత ఆయ‌న బీఎస్పీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బీఎస్పీ నేత‌ల‌తో మాట్లాడిన ఆయ‌న .. త‌న నిర్ణయాన్ని అధికారికంగా ప్రక‌టించ‌నున్నారు.

About Author