NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రూ. 200 కోట్లు ఖ‌ర్చు.. వ‌సూళ్లు చేసింది ఎంతంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ‘సామాట్ర్ పృథ్వీరాజ్’. రూ. 200కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించాడు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో జూన్ 3న హిందీ, తెలుగు, తమిళ్‌లో విడుదల అయింది. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది. సినిమా విడుదలైన 10వరోజు రూ.1.85కోట్ల నుంచి రూ. 2కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 62కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. పూర్తి రన్‌లో దాదాపుగా రూ. 65కోట్ల వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు. ఈ సినిమాతో మేకర్స్‌కు భారీ నష్టాలు తప్పేలా లేవు.

                                                   

About Author