PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ. 59 కోట్ల మిగులు బడ్జెట్ ఏమైంది.?

1 min read

– మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి డిమాండ్
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల: నంద్యాల మున్సిపాలిటీ లో రూ.59కోట్ల మిగులు బడ్జెట్ ఏమైందో మున్సిపల్ అధికారులు, ఎం ఎల్ ఏ శిల్పా ప్రజలకు చెప్పాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో భూమా మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న నంద్యాల మున్సిపాలిటీ నీ అవినీతి మయంగా మార్చారని దుయ్యబట్టారు..గత మూడేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న టిడిపి కౌన్సిలర్ లకు ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వకుండా కౌన్సిల్ సమావేశాలు అధికార పార్టీ భజన కోసం వినియోగించారని భూమా ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల మున్సిపాలిటీ అవినీతి పై పత్రికలు, మీడియా, సోషల్ మీడియా రోజు ప్రసారం చేస్తున్న స్థానిక ఎం ఎల్ ఏ శిల్పా నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా వ్యవహరిస్తున్నారని భూమా ఎద్దేవా చేశారు..అన్న నందమూరి హయాంలో నంద్యాలలో సమ్మర్ స్టోరేజ్ టాంక్ ఏర్పాటు చేయగా తమ హయాంలో అమృత స్కీమ్ ప్రారంభించామని వీటిని సద్వినియోగం చేసుకోవడం కూడా ఈ మున్సిపాలిటీ కి సాధ్యం కాక వర్షా కాలంలో సైతం పట్టణ ప్రజలకు రెండు రోజులకు ఒకసారి నీటిని విడుదల చేసేందుకు సిగ్గుగా లేదా అని భూమా ప్రశ్నించారు..వేసిన రోడ్ల పైనే ప్యాచింగులు వేసి చేసిన పనులనే తిరిగి మళ్లీ చేసినట్లు ఫోటోలు చూపించి నిధులు భారీ ఎత్తున స్వాహా చెయ్యడం మినహా పట్టణంలో మున్సిపాలిటీ చేస్తున్న పనులు లేవని ఆయన ఆరోపించారు. పట్టణ ప్రణాళిక శాఖలో 14 శాతం నిధులు స్వాహా అయ్యాయని బట్టబయలు అయినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని భూమా డిమాండ్ చేశారు. పట్టణంలో కుక్కల బెడద ఎక్కవై ప్రజలు ఇబ్బంది పడుతున్న, ఇటీవల ఓ చిన్నార పై దాడిచేసి ప్రాణం మీదికి తెచ్చిన ఈ మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులు కు పట్టక పోగా వాటిని పట్టుకుని వ్యాక్సిన్ ఇచ్చినట్లు బిల్లులు చేసుకుంటున్నరంటే ఈ దిక్కుమాలిన మున్సిపాలిటీ పనితీరు అర్థం అవుతుందన్నారు.నాటి నుండి నేటి వరకు టిడిపి హయాంలో జరిగిన శాశ్వత అభివృద్ధి మినహా శిల్పా హయాంలో ఏమి చేసారో చెప్పాలని భూమా సవాల్ విసిరారు..మున్సిపల్ సమావేశాలు మొక్కుబడిగా నిర్వహిస్తూ ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే బెల్ కొట్టి ముగింపు చేసినంత మాత్రాన మీ బండారం బయటకు రాదని అనుకోవడం మీ బ్రమ అని భూమా అన్నారు..ఇప్పటికన్నా మున్సిపాలిటీ ప్రజల కోసం పనిచెయ్యకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని భూమా హెచ్చరించారు.

About Author