రూ. 45 వేల కోట్ల ఝున్ ఝున్ వాలా ఆస్తుల్ని ఎవరు నిర్వహిస్తారంటే ?
1 min read
పల్లెవెలుగువెబ్ : ప్రముఖ పెట్టుబడిదారుడు, బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆకస్మిక మరణం తరువాత ఆయన పెట్టుబడుల నిర్వహణ, ట్రస్ట్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై మార్కెట్ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. అయితే మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం ఝన్‌ఝన్‌వాలా విశ్వసనీయ మిత్రుడు, గురువు, డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ ఝున్‌ఝున్‌వాలా ఎస్టేట్‌కు ప్రధాన ట్రస్టీగా వహిరిస్తారు. ఝున్‌ఝున్‌వాలా ప్రస్తుత పెట్టుబడులపై దమానీనే తుది నిర్ణయం తీసుకుంటారు. ఇతర విశ్వసనీయలు కల్‌ప్రజ్ ధరంషి అమల్ పారిఖ్ ఇతర ట్రస్టీలుగా ఉంటారు.