NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంగమేశ్వరుడి సన్నిధిలో ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్

1 min read

– సప్తనదీ సంగమేశ్వరంలో పూజలు నిర్వహించిన ఆర్..ఎస్.ఎస్.చీఫ్..
– పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికిన వేద పండితులు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం సంగమేశ్వర క్షేత్రంలో ఆదివారం భారీ బందోబస్తు మధ్య ఆర్.ఎస్.ఎస్.చీఫ్ మోహన్ జీ భగవత్ సంగమేశ్వర అలయంను సందర్శించారు. ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో మం గళ వాయిద్యాలు తో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో గంగ పూజ నిర్వహించి గర్భాలయంలోని వేపదారు శివలింగానికి రుద్రాభిషేక పూజ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ పురోహితులు తెలకపల్లి క్షేత్ర మహత్యం గురించి వారికి వివరించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆలయ పురోహితులు కోరారు. ఆనంతరం వారికి ఆలయ తీర్థప్రసాదాలు అందించి పట్టు వస్త్రాలతో సత్కరించారు.తిరుగు ప్రయాణంలో కొత్తపల్లి మండలంలోని ప్రముఖ వ్యాపారవేత్త, విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ మాజీ అధ్యక్షుడు దివంగత జి.పుల్లారెడ్డి స్వగ్రామమైన గోకవరం గ్రామం లో ఆర్ ఎస్ఎస్ సహకారంతో నిర్వహిస్తున్న భక్త కన్నప్ప చెంచు గురుకుల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు.అక్కడే దాదాపు రెండు గంటల సేపు ఆయన అక్కడ గడిపారు. బోజనాంతరం అక్కడి నుంచి కర్నూలు కు వెళ్లారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ పర్యటన సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

About Author